మిస్టీరియస్‌ సూపర్‌ గర్ల్‌ అనుష్క

మిస్టీరియస్‌ సూపర్‌ గర్ల్‌ అనుష్క

ఓ సినిమా హిట్టయితే ఆ దారిలో ఇంకొన్ని సినిమాలు వస్తుంటాయి. 'పికె' హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రం. 300 కోట్ల వసూళ్ళ క్లబ్‌లో చేరిందీ సినిమా. ఇందులో హీరో అమీర్‌ఖాన్‌ ఏలియన్‌గా కనిపించాడు. ఆ కాన్సెప్ట్‌తోనే ఏలియన్‌లా హీరోయిన్‌ అనుష్క శర్మని ఊహించుకుంటూ ఓ కథను రెడీ చేసుకున్నాడట బాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడు. హాలీవుడ్‌ సినిమాల్లో యాక్షన్‌ గర్ల్స్‌ అనగానే కంగనా రనౌత్‌, ప్రియాంకా చోప్రా లాంటి హీరోయిన్లు గుర్తుకు వస్తారు. అనుష్క శర్మతో అలాంటి స్టంట్స్‌ చేయిస్తూ, ఏలియన్స్‌ తరహా సినిమాని తీయాలని ఆ దర్శకుడు అనుకుంటున్నాడట.

'పికె' సినిమా రిలీజ్‌కి ముందు 'టెర్మినేటర్‌' టైప్‌ సినిమా అని గాసిప్స్‌ వచ్చాయి. కాని 'పికె' ఎవరి ఊహలకు అందని డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చింది. ఆ సినిమాతో అనుష్కకీ మంచి పేరొచ్చింది. అందుకే అనుష్కతో ఓ భారీ యాక్షన్‌ సినిమాని రూపొందించాలనే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అనుష్క కూడా అలాంటి సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నానంటోంది. అయితే అనుష్క కన్నా కంగనా రనౌత్‌ యాక్షన్‌ సినిమాలకు బెస్ట్‌ ఆప్షన్‌ అంటున్నారు బాలీవుడ్‌ సినీ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు