బాలయ్యకా దురుద్దేశం లేదట!

బాలయ్యకా దురుద్దేశం లేదట!

చాన్నాళ్ల గ్యాప్ తర్వాత సినిమా మొదలెట్టిన బాలయ్యకి పాపం అన్నీ కష్టాలే. మొదట టైటిల్ టెన్షన్. తర్వాత హీరోయిన్ టెన్షన్. ఇప్పుడు నిర్మాతల టెన్షన్ తో అతడికి తల పగిలిపోయేలా ఉంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న 'జయసింహ' చిత్రంలోని కొన్ని డైలాగ్స్ బయటకు పొక్కాయి. వాటిని విన్న అందరూ షాకయ్యారు. ఎందుకంటే అవి పక్కా పొలిటికల్ డైలాగ్స్. పైగా అచ్చు గుద్దినట్టు చిరంజీవిని తిడుతున్నట్టు, అతడి మీద సెటైర్లు వేస్తున్నట్టే ఉన్నాయి.

 దాంతో బాలయ్య దృష్టంతా వచ్చే యేడు జరిగే ఎలక్షన్ల మీదే ఉందని అర్థమైంది అందరికీ. అందుకే చిరంజీవి మీద గురిపెడుతున్నాడని, సినిమాని అడ్డు పెట్టుకుని అతడి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని అన్ని పత్రికలూ, వెబ్ సైట్లూ రాసేశాయి. దాంతో ఆ నిర్మాతలు తలలు పట్టుక్కూచున్నారు. ఏదో పెద్ద హీరో కదా సినిమా తీద్దామనుకుంటే, ఈ తలనొప్పులన్నీ మాకెందుకురా దేవుడా అంటూ తిట్టుకుంటున్నారట.

కానీ అలా కూచుని ఫీలయితే లాభం లేదనుకున్నారో ఏమో, నోళ్లు తెరిచి కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్సేమీ లేవట. చిరంజీవిని బ్యాడ్ చేయాలన్న దురుద్దేశం బాలయ్యకి అస్సలు లేదట. అసలీ సినిమాలో పొలిటికల్ ఎలిమెంట్సే ఉండవట. బాలయ్య వేసేది కూడా పొలిటీషియన్ పాత్ర కాదట. ఇది పక్కా కమర్షియల్ సినిమా అంటూ డప్పు కొట్టి చెబుతున్నారు. నమ్మవచ్చంటారా! అసలు పొలిటికల్ ఎలిమెంట్సే లేకపోతే, ఆ డైలాగ్ సంగతేంటి! నువ్వు ఏ పార్టీవాడివో, ఇప్పడే పార్టీలో ఉన్నావో నాకు బాగా తెలుసంటూ బాలయ్య ఆవేశంగా చెప్పిన డైలాగ్ పరిస్థితి ఏంటి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు