డైరెక్టర్‌గారబ్బాయి కొత్త వేషాలు

డైరెక్టర్‌గారబ్బాయి కొత్త వేషాలు

అదేంటో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర దర్శకుల కొడుకులు ఎవరూ హీరోలాగా నిలదొక్కుకోలేకపోయారు. టాప్‌ హీరోల కొడుకులు మాత్రమే కొద్దోగొప్పో రాణిస్తున్నారు కాని, దర్శకుల, రచయితల పిల్లలు పెద్దగా సక్సెస్‌ చవిచూడలేదు.

దర్శకరత్న దాసరి పుత్రరత్నం అరుణ్‌, రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌, పరుచూరి కుమారుడు, వగైరా రెండోతరమంతా విజయాలు అందులేకపోయారనే చెప్పాలి. ఇదే కోవలోకి చెందిన మరో హీరో, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌. స్వయానా తండ్రే రంగంలోకి దిగినా మనోడు నిలదొక్కుకోలేదు.ఇప్పుడు కొత్తగా హీరో రోల్స్‌ వదిలేసి క్యారెక్టర్‌ రోల్స్‌పై పడ్డాడు.

త్వరలో రానున్న కహాని రీమేక్‌ 'అనామిక'లో మనోడు ఒక కానిస్టేబుల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. తన భర్తను వెతుక్కుంటూ వచ్చిన నయనతారకు సహాయపడే రోల్‌లో వైభవ్‌ బాగా అలరిస్తాడని దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ఈ కొత్తవేషాలు వైభవకు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English