మహేష్‌ కంటే మనీ ముద్దు!

మహేష్‌ కంటే మనీ ముద్దు!

ఎన్టీయార్‌తో నటించాలని ఉందని చెప్పింది బాలీవుడ్‌ చిన్నది అలియాభట్‌. నాగార్జునతో ఛాన్స్‌ వస్తే వదులుకుంటానా? అని హొయలుపోయింది హిందీ అందాల తార విద్యాబాలన్‌. తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని కథలు బాగా చెప్పింది సోనాక్షి సిన్హా 'లింగా' సినిమా ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు. మహేష్‌బాబుతో నటించాలని ఉందని అనని బాలీవుడ్‌ బ్యూటీ లేదు.

తెలుగులో నటించడానికి అంత ఇష్టపడ్డారు కదా అని నిర్మాతలు, దర్శకులు ఆ హీరోయిన్లని అప్రోచ్‌ అయితే, ఒక్కరి నుంచీ సానుకూల స్పందన రాలేదట. రీజన్‌ ఏంటో తెలుసా? రెమ్యునరేషన్‌. వారికి సరిపడా రెమ్యునరేషన్‌ ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌కొచ్చి, తెలుగు సినిమాలపై ఆసక్తి చూపినవారంతా సింపుల్‌గా 'నో' చెప్పేస్తున్నారు. అలియా విషయంలో ఓ యంగ్‌ హీరో డెబ్యూ మూవీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో విసిగిపోయే ఆ యంగ్‌ హీరో సినిమాకి ఇంకో హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశార్ట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు