కాజల్‌ రేటంతా డ్రామానే!!

కాజల్‌ రేటంతా డ్రామానే!!

ఈ సంవత్సరం మొదలవగానే 'నాయక్‌' పెద్ద హిట్టయ్యింది. ఆ తరువాత 'బాద్షా' ఇంకో బ్లాక్‌బస్టర్‌. ఈ రెండింటిలో హీరోయిన్‌ కాజల్‌ కాబట్టి, సాధారణంగానే ఆమెకు డిమాండ్‌ భారీ రేంజ్‌లోనే ఉంటుంది.కాని విశేషమేంటంటే, బాద్షా సినిమా విడుదలైనప్పటినుండి కాజల్‌ ఖాళీగానే ఉంది. ఒక్క సినిమా కూడా సైన్‌ చెయ్యలేదు.

ఏదో తెలుగులో ఎవడు సినిమాలో చేస్తున్న ఒక చిన్న రోల్‌ కోసం రెండు రోజులపాటు షూటింగ్‌కు వచ్చి వెళ్లింది. తన చెల్లెలి సినిమాల ఆడియో ఫంక్షన్లకు కూడా రావడంలేదు.ఇక రెండు కోట్లు డిమాండ్‌ చేస్తోంది కాబట్టే ఆమెకు ఎవరూ ఆఫర్స్‌ ఇవ్వడంలేదని ఫిలిం నగర్‌ టాక్‌. అయితే ఇందులో నిజం లేదట. అసలు కాజల్‌కు అంత డిమాండ్‌ చేసే సీన్‌ లేదంటున్నారు విశ్లేషకులు.

ఈ మధ్య బాగా లావెక్కిన కాజల్‌, యంగ్‌ హీరోయిన్స్‌ ముందు బాగా తేలిపోతోందని, అందుకే ప్రొడ్యూసర్లు ఆమెను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. తమన్నా, సమంత, శృతిహాసన్‌, అమలాపాల్‌ వంటి యంగ్‌ క్యూటీల ముందు కాజల్‌ ఆంటీగా కనిపిస్తోంది టాక్‌ రావడంతో, తన మేనేజర్‌తో కలసి ఈ 'రేటు' రూమర్‌కు తెరలేపిందనీ వీళ్ళు చెబుతున్నారు. ఏమో నిజం కాజల్‌కే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు