రాజమౌళి డౌట్‌లో పడేసాడు

రాజమౌళి డౌట్‌లో పడేసాడు

హీరోగా అనుకున్నంతగా సక్సెస్‌ కాలేకపోయిన రాణా ఇప్పుడు 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ చేస్తూ.. వీటితో తన జాతకం మారిపోతుందని ఆశిస్తున్నాడు. అయితే ఈ సినిమాలు రిలీజ్‌ అయ్యే వరకు హీరో వేషాలు కట్టి పెట్టాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్‌ అతడిని ఇంకా వేధిస్తోంది. ఆమధ్య అందాల రాక్షసి దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడని టాక్‌ వినిపించింది. కానీ ఆ చిత్రం చేయకుండా బాహుబలితో రాణా కంటిన్యూ అయిపోయాడు. ఇప్పుడు పరశురాం డైరెక్షన్‌లో చుట్టాలబ్బాయి అనే సినిమా చేయబోతున్నాడని వినిపిస్తోంది.

మరి ఇదైనా వెంటనే మొదలు పెడతాడో, లేక తన భారీ సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడాలని అనుకుంటాడో. మొత్తానికి రాణాని పెద్ద కన్‌ఫ్యూజన్‌లోనే పడేసాడు రాజమౌళి. బాహుబలి తర్వాత తప్పకుండా నటుడిగా తన రేంజ్‌ పెరుగుతుందని, ఒక ఇమేజ్‌ అంటూ వస్తుందని రాణా నమ్ముతున్నాడు. అయితే ఈ చిత్రం రెండు పార్టులు రావడానికి చాలా టైముంది. అంతదాకా రాని ఆ సినిమా కోసం అంతవరకు వచ్చే అవకాశాలు వదులుకోవాలా వద్దా అనే సందిగ్ధం అతడిని పీడిస్తోంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు