మహేష్‌బాబు హ్యాండు పడింది

మహేష్‌బాబు హ్యాండు పడింది

చిన్న చితకా చిత్రాల్లో నటిస్తూ కాలక్షేపం చేస్తోన్న పూర్ణపై ఇంతవరకు పెద్ద హీరోలు, దర్శకుల కళ్లు పడలేదు. మంచి టాలెంట్‌ ఉన్న పూర్ణ డాన్స్‌ కూడా ఇరగదీస్తుంది. క్లాసికల్‌ డాన్సర్‌ అయిన తను ఏ రకం డాన్సులతో అయినా అదరగొడుతుంది. 'అవును', 'సీమ టపాకాయ్‌'లాంటి సినిమాలతో తప్ప పెద్దగా సందడి చేయలేకపోయిన పూర్ణపై ఇప్పుడు మహేష్‌బాబు హ్యాండ్‌ పడింది. మహేష్‌ హీరోగా రూపొందుతోన్న కొరటాల శివ చిత్రంలో పూర్ణ ఒక ప్రత్యేక గీతం చేస్తోంది. దీనిని ఐటెమ్‌ సాంగ్‌ అనవద్దని అంటున్నారు. ఎందుకంటే క్లాసికల్‌ డాన్స్‌ నేపథ్యంలో చాలా పద్ధతిగా ఉంటుందట ఈ పాట. పూర్ణ మంచి కథక్‌ డాన్సర్‌ కాబట్టి ఆమెని ఈ అవకాశం వరించింది. మహేష్‌బాబు సినిమాలో సాంగ్‌ చేసాక తప్పకుండా వేరే పెద్ద హీరోల దృష్టిలోకి కూడా వస్తుంది కనుక పూర్ణ జాతకం మారినట్టే అనిపిస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న రవిబాబు చిత్రం 'అవును 2' కూడా పెద్ద హిట్‌ అవుతుందని పూర్ణ కాన్ఫిడెంట్‌గా చెప్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English