అల్లు అరవింద్‌ ఏమైపోయాడు?

అల్లు అరవింద్‌ ఏమైపోయాడు?

పబ్లిసిటీ స్కిల్స్‌లో కొత్త పుంతలు తొక్కుతూ గీతా ఆర్ట్స్‌ సంస్థ వరుస విజయాలతో దూసుకెెళుతూ వచ్చింది. సినిమా తీయడం కంటే దానిని మార్కెట్‌ చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్న గీతా ఆర్ట్స్‌ నుంచి వరుసగా క్వాలిటీ ప్రాడక్టులు సెట్‌ అయ్యాయి. దాంతో వాటిని మార్కెట్‌ చేయడం గీతా ఆర్ట్స్‌కి మరింత సులువయింది. అయితే ఒక బ్యాడ్‌ ప్రాడక్ట్‌ వచ్చినపుడే అసలు మేటర్‌ బయటపడుతుంది.

బద్రినాథ్‌ రూపంలో గీతా ఆర్ట్స్‌ జైత్రయాత్రకి గండి పడింది. విపరీతంగా పబ్లిసిటీ చేయడం ద్వారా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్‌ అయితే రాబట్టగలిగారు కానీ ఫుల్‌ రన్‌లో బద్రినాథ్‌ లాస్‌ వెంఛర్‌ అయింది. దాంతో ఒక్కసారిగా చిత్ర నిర్మాణం కూడా ఆపేసారు. బద్రినాథ్‌ తర్వాత ఇంతవరకు గీతా ఆర్ట్స్‌ సంస్థ నుంచి సినిమానే రాలేదు. మొన్నీమధ్య 'చారులత'ని రిలీజ్‌ చేస్తే అదీ ఫ్లాపయి చేతులు కాలాయి.

హిందీ గజినితో మొదలుపెట్టి మగధీర వరకు తిరుగులేని విజయాలు అందుకున్న గీతా ఆర్ట్స్‌ ప్రస్తుతానికైతే ఏ సినిమా చేయడం లేదు. మెగా హీరోలు ముగ్గురూ కూడా వేరే బ్యానర్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్‌ పాలిటిక్స్‌తో బిజీగా ఉండడం వల్ల సినీ నిర్మాణం పక్కన పెట్టారో, మరేదైనా కారణముందో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు