గ్రీకువీరుడు కామెడీ అదిరింది

గ్రీకువీరుడు కామెడీ అదిరింది

నాగార్జున హీరోగా దశరథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గ్రీకువీరుడు’ 50రోజులు ఆడిరదా? అంటే..నమ్మశక్యం కాని విషయమిది. సకుటుంంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ గురించి తెలుసు గానీ ..ఇంకా థియేటర్లలో ఉందా? అన్నదే ప్రశ్నార్థకం. ఒకవేళ ఉన్నా..ఏఏ థియేటర్లలో ఆడుతుందో సదరు చిత్రవర్గాలే స్వయంగా చెప్పాలి. చీకటి థియేటర్‌లో సీటు కోసం టార్చ్‌ వేసి వెతికినట్టు...రాష్ట్రంలో ఇది ఏ థియేటర్‌లో ఆడుతుందో..పెట్రోమాక్స్‌ వెలిగించి మరీ వెతకాలి.

 అయితే ఈ మధ్యనే 50 రోజుల పోస్టర్లు  పబ్లిక్‌ప్లేసుల్లో గోడలు, స్థంబాలపై దర్శనమిస్తున్నాయి. మరీ కామెడీ ఏమిటంటే ‘బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌’ అనే ట్యాగ్‌ కూడా ఈ పోస్టర్లలో తగిలించి పెద్ద కామెడీ చేసేశారు. ఈ సినిమాలో కంటెంట్‌ నిజంగా వినోదాన్నిచ్చిందా? దశరథ్‌ సినిమాని అంత గొప్పగా తీశాడా? తీస్తే..తొలివారంలోనే థియేటర్లు ఎందుకు ఖాళీ అయ్యాయి? అని జోకులేసుకుంటూ ఫిలింనగర్‌ జనాలు తెగ నవ్వుకుంటున్నారు. భలే కామెడీ చేస్తున్నారు బాసూ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు