కమెడియన్‌ సీన్‌ సితార్‌

కమెడియన్‌ సీన్‌ సితార్‌

బ్రహ్మానందం, బాబూమోహన్‌, అలీ, శివాజీరాజా ఇలా ఎందరో కమెడియన్స్‌ హీరోలుగా చేశారు. అలీ తప్పించి, కమెడియన్స్‌ హీరోలుగా సక్సెస్‌ అయిన సందర్భాలు తక్కువ. అలీ కూడా హీరో ఇమేజ్‌ ఎక్కువ కాలం వర్కవుట్‌ అవదని తొందరగానే తెలుసుకుని, కమెడియన్‌గా ఎక్కువ సినిమాలు చేస్తూ, వీలు చిక్కినప్పుడు మాత్రమే హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సునీల్‌ అలా కాకుండా హీరో అయ్యాక, కమెడియన్‌గా సినిమాలు చేయడం మానేయడం పెద్ద తప్పిదంగా మారింది. భారీ ఓపెనింగ్స్‌ రాబట్టగలిగే హీరో అయ్యాడుగానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు సునీల్‌. వెనక్కి తిరిగి కమెడీయన్‌గా మారలేక, హీరోగా సినిమాలు చేయలేక సీన్‌ రివర్స్‌ అయిపోయింది అతనికి. కథల ఎంపికలో పొరపాట్లు సునీల్‌ని ఇబ్బందుల్లో పడేశాయి.

స్టార్‌ హీరో అవుతాడనుకున్న సునీల్‌, సీన్‌ సితార్‌ అయిపోయిన స్టేజ్‌లో ఉండడం అతన్ని అభిమానించేవారికి మింగుడుపడ్డంలేదు. సిక్స్‌ ప్యాక్‌ వృధా అయిపోయిందేమో అన్పిస్తుంది సునీల్‌ని చూస్తే. మోహన్‌బాబులా విలనిజం పండించాలని ఉందని ఎప్పుడూ చెప్పే సునీల్‌ని ఆ యాంగిల్‌లో చూపాలనే థాట్‌ ఎవరికైనా వస్తే, కొత్త సునీల్‌ని చూడొచ్చు. అలాగే సునీల్‌ కమెడియన్‌గా తిరిగి ప్రేక్షుల్ని నవ్వించాలనుకుంటే, అతనికోసం ఆడియన్స్‌లో క్రేజ్‌ ఇంకా అలానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు