రామ్‌ చరణ్‌ ఇక బయటకి రాడా?

రామ్‌ చరణ్‌ ఇక బయటకి రాడా?

'ఆరెంజ్‌' ఒక్కటి ఫ్లాప్‌ అయినందుకు రామ్‌ చరణ్‌ క్లాస్‌ సినిమాలు చేయడమే మానేశాడు. తన వయసుకి తగ్గ క్యారెక్టర్స్‌, లవ్‌స్టోరీస్‌ వైపు అస్సలు చూడ్డం లేదు. రొటీన్‌ మాస్‌ సినిమాలైన 'రచ్చ', 'నాయక్‌' హిట్టవడం అతని మైండ్‌సెట్‌ని పూర్తిగా మార్చేసింది. ఇక అన్నీ అలాంటి సినిమాలు చేయడమే సేఫ్‌ అనుకుంటున్నాడు.

ప్రస్తుతం చరణ్‌ చేస్తున్న ఎవడు, తుఫాన్‌ సినిమాలు కూడా మాస్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నవే. వీటిలో అతను యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ పాత్రలు పోషిస్తున్నాడు. ఇక లవర్‌బాయ్‌గా ఎప్పుడు నటిస్తాడు? కొత్త కొత్త కథలు ఎప్పుడు ట్రై చేస్తాడు. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయడానికి అంగీకరించాడు. అదీ మాస్‌ సినిమానే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో కూడా చరణ్‌ ఓ సినిమా చేయనున్నాడు. లారెన్స్‌తో కూడా ఒక ప్రపోజల్‌ ఉందట.

లారెన్స్‌ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించే సాకుతో లారెన్స్‌ తన సినిమాల నిండా విపరీతమైన నస పెట్టేస్తాడు. ఆ సినిమాలు కొద్ది రోజులు బాగానే ఆడేస్తాయి కానీ హీరోలకి మాత్రం వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక్క ఎక్స్‌పెరిమెంట్‌ మిస్‌ఫైర్‌ అయినందుకు చరణ్‌ మరీ ఇలా ఓ ఇమేజ్‌ ఛట్రంలో బందీ అయిపోవడం మాత్రం బాలేదని విమర్శకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు