మంచు విష్ణు సీరియస్‌గా తీసుకున్నాడు

మంచు విష్ణు సీరియస్‌గా తీసుకున్నాడు

ఈమధ్య కాలంలో ప్రయోగాలు ఎక్కువ చేసి చేతులు కాల్చుకున్న మంచు విష్ణు తన తదుపరి చిత్రంలో మాత్రం కమర్షియల్‌ విలువల్నే నమ్ముకుంటున్నాడు. కామెడీ చిత్రాలతో కాలక్షేపం చేస్తూ వచ్చిన విష్ణు సడన్‌గా అవుట్‌ డేటెడ్‌ డైరెక్టర్స్‌తో వరుసగా రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సులాంటి చిత్రాలు చేయడంతో అతని కెరియర్‌ గ్రాఫ్‌ పడిపోయింది. దీంతో అలర్ట్‌ అయిన మంచు విష్ణు తన నెక్స్‌ట్‌ మూవీలో యాక్షన్‌ హీరోగా కనిపించబోతున్నాడు.

ఎలాంటి ప్రయోగాలు లేకుండా సీరియస్‌ అవతార్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇందుకోసం అతను మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంటున్నాడు. బ్యాంకాక్‌లో కొత్త రకం మార్షల్‌ ఆర్ట్స్‌ ఏవో నేర్చుకుంటోన్న విష్ణు వాటిని ఈ చిత్రంలో ప్రదర్శించబోతున్నాడు.     విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. తమిళంలో విజయవంతమైన అరిమనంబి చిత్రానికి రీమేక్‌ అయిన ఈ మూవీలో విష్ణు సరసన అదా శర్మ నటిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు