రజనీకాంత్‌ అబద్ధం చెప్పాడా?

రజనీకాంత్‌ అబద్ధం చెప్పాడా?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గట్టిగా చెప్పాడంటే అది డైలాగే అయినా అందులో విషయం ఉంటుంది. అందుకే రజనీకాంత్‌ కొత్త సినిమా 'లింగ'పై ఎక్స్‌పెక్టేషన్స్‌ స్కై హై రేంజ్‌లో ఉన్నాయి. కానీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా మిగిలింది. భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయిగానీ, సినిమా సక్సెస్‌ఫుల్‌ రన్‌ని రెండో రోజే కొనసాగించలేకపోయిందని ట్రేడ్‌ రిపోర్ట్స్‌ స్పష్టం చేశాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇలా ఎక్కడా 'లింగ'కి వసూళ్ళు లేవు. రజనీ ఈజ్‌ బ్యాక్‌ అని తొలి రోజు సంబరాలు చేసుకున్న ఫాన్స్‌, రెండోరోజు ట్రేడ్‌ రిపోర్ట్స్‌తో నివ్వెరపోయారు.

ఈ సినిమా కథ గురించా రజనీకాంత్‌ 'గొప్ప కథ' అని చెప్పింది? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. 'లింగ' సినిమాపై వివాదాల వల్ల పబ్లిసిటీ పెరిగింది తప్ప, రజనీకాంత్‌కి మునుపు ఉన్న క్రేజ్‌ ఇప్పుడు లేదనే కామెంట్స్‌ నిజం అవుతున్నాయి. కమర్షియల్‌ మూవీని రజనీకాంత్‌ ఎంచుకున్నా 'పాత వాసనలనుంచి' దూరం అవలేదు చిత్ర దర్శకుడు. సినిమా గురించి రజనీకాంత్‌కి ముందే అర్థమయిపోయి, జస్ట్‌ పబ్లిసిటీ కోసం తమిళనాడులోనూ, తెలుగు గడ్డమీదా ప్రమోషన్‌కి వచ్చాడన్నారు. 'లింగ' రిజల్ట్‌తో ఇది నిజం అని ప్రూవ్‌ అయ్యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు