బాక్సాఫీస్‌: కలెక్షన్స్‌ దఢేల్‌!

బాక్సాఫీస్‌: కలెక్షన్స్‌ దఢేల్‌!

రజనీకాంత్‌ 'లింగ' వీకెండ్‌ వరకు వీర విహారం చేసినా కానీ సోమవారం పరీక్షలో అట్టర్‌ఫ్లాప్‌ అయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి. తమిళనాడులో చాలా థియేటర్లలో షోస్‌ గణనీయంగా తగ్గించేసారు. కనీసం ఒక పది రోజుల పాటు అయినా రజనీ మేనియా ఉంటుందని ఆశ పడ్డ ఇన్వెస్టర్లకి కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోవడంతో కంగారు మొదలైంది.

ఈ చిత్రంపై భారీగా ఇన్వెస్ట్‌ చేసిన వారంతా సేఫ్‌ జోన్‌లోకి రావాలంటే దాదాపు అసాధ్యమనే అనిపిస్తోంది. మరీ 'బాబా' లెవల్లో కాకపోయినా కానీ భారీగానే నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే రెండవ వారంలోనే ఆదుకొమ్మంటూ రజనీకాంత్‌ ఇంటికి పరుగులు తీసే అవకాశాలున్నాయి. రజనీకాంత్‌ ఈమధ్య కాలంలో చేసిన సినిమాలు అంతటి ఘన విజయాలు సాధించడానికి కారణం కొత్తదనం కాగా ఈ చిత్రంలో దాని ఛాయలే లేవు. కె.ఎస్‌. రవికుమార్‌ ఇంకా ఇరవయ్యేళ్ల నాటి ముతక కథ, కథనాలని నమ్ముకుని సినిమా తీసేసాడు. రజనీకాంత్‌ కూడా ఆదుకోలేని పరిస్థితి ఎదురు కావడంతో లింగ బయ్యర్లు పడిపోతున్న కలెక్షన్లని చూసి బెంబేలెత్తిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు