అసలు నాగబాబు తప్పు లేదంట!

అసలు నాగబాబు తప్పు లేదంట!

సినీ పరిశ్రమలో సమయపాలన చాలా ముఖ్యం. ఇక్కడ డెడ్‌లైన్ల మీద పని పూర్తవ్వాలి. అలా కాకుండా జాగారం చేస్తామంటే అస్సలు కుదరదు. సకాలంలో పని జరగకపోతే ఛాన్స్‌లు వేరేవాళ్లకు వెళ్లిపోతాయి. సరిగ్గా శ్రీకాంత్‌ అడ్డాల విషయంలో అదే జరిగింది. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోని చెయ్యమని శ్రీకాంత్‌ అడ్డాల చేతిలో పెట్టాడు. అయితే ఆ పనిని శ్రీకాంత్‌ ఇన్‌టైవ్‌ులో చేయలేక మెగాఛాన్స్‌ని కోల్పోయాడు.

తొలుత నాగబాబుకి స్టోరీ లైన్‌ చెప్పడంతో, శ్రీకాంత్‌కు దానిని డెవలప్‌ చేయమని ఓ గడువు విధించాడు మెగా బ్రదర్‌. అయితే గడువులోపే శ్రీకాంత్‌ చెప్పిన కథలో అంతగా డెప్త్‌, ట్విస్టులు లేకపోవడంతో..ఇంప్లిమెంటేషన్‌కి మరో ఛాన్సిచ్చాడట. అయితే అప్పటికీ సదరు దర్శకుడు పనిని సవ్యంగా పూర్తిచేయలేకపోయాడు.

దాంతో నమ్మకం పోయిన నాగబాబు తన కొడుకుని హీరోని చెయ్యమంటూ పూరి వద్దకెళ్లాడు. ప్రస్తుతం స్పీడ్‌ డైరెక్టర్‌ ఆ పనిలో బిజీగా తలమునకలై ఉన్నాడు. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌లో నాగబాబు తప్పేమీ లేదని అర్థమవుతోంది. శ్రీకాంత్‌ అడ్డాల ఇచ్చిన పనిని సకాలంలో పూర్తిచేయలేకపోవడమే మిస్టేక్‌ అని తేలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English