కోత మొదలైంది... రాత మారుద్దా?

కోత మొదలైంది... రాత మారుద్దా?

కామెడీ చిత్రమైనా కానీ తన సినిమా బ్రహ్మాండంగా ఆడేస్తుందనే నమ్మకంతో దర్శకుడు అనిల్‌ సుంకర ‘యాక్షన్‌ 3డి’పై కోట్లు కుమ్మరించారు. రవితేజలాంటి హీరోతో చేసే చిత్రం కంటే కూడా దీని బడ్జెట్‌ ఎక్కువైందట. స్టార్స్‌ లేని ఈ సినిమా కేవలం 3డి ఆకర్షణతో నెట్టుకొచ్చేస్తుందని అతను భ్రమపడ్డారు. హ్యాంగోవర్‌ అనే ఆంగ్ల చిత్రాన్ని కాపీ కొట్టి ఒరిజినల్‌ కామెడీ తీసినట్టు బిల్డప్‌ ఇచ్చారు. అయితే ప్రీమియర్‌ షోతోనే ఈ సినిమా భండారం బయటపడిపోయింది. ఆ షోతోనే చిత్రానికి బ్యాడ్‌ టాక్‌ వచ్చేసింది.

 సినిమా చెత్తగా ఉండడమే కాకుండా సాగదీశారని, అంతసేపు 3డి గ్లాసెస్‌తో చూడలేకపోయామని ప్రేక్షకులు వాపోతున్నారు. దీంతో ఈ సినిమా నిడివి తగ్గించారు. పబ్లిక్‌ టాక్‌ని బట్టి బాలేవు అనుకున్న సీన్లు కొన్ని తీసేశారు. పదిహేను నిముషాల పాటు సినిమా కత్తెరకి గురైనట్టు సమాచారం. ఈ కోత వల్ల సినిమా రాత ఏమైనా మారే అవకాశం ఉందా అంటే అనుమానం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో బాగున్నదంటూ ఏదైనా ఉంటే అది పదిహేను నిముషాలు మాత్రమేనేమో. నిజానికి టాక్‌ని బట్టి ఎడిట్‌ చేసి వదలాలంటే ఆ పదిహేను నిముషాలు మాత్రమే ఉంచాల్సి వస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English