ఎబ్బే... దెబ్బడిపోయింది!

ఎబ్బే... దెబ్బడిపోయింది!

 కొన్ని సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించినా కానీ స్నేహా ఉల్లల్‌కి ఎందుకో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అటు హిందీ, ఇటు తెలుగుతో పాటు ఏ భాష నుంచి ఆమెకి ఆఫర్స్‌ రావడం లేదు. రాక రాక వచ్చిన ఒక్క ఛాన్స్‌ కూడా వేస్ట్‌ అయిపోయిందని ఆమె ఇప్పుడు బాధ పడుతోంది. యాక్షన్‌ 3డి చిత్రంపై స్నేహ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ప్రేక్షకులు తనని గ్లామరస్‌ హీరోయిన్‌గా చూడలేదు కాబట్టి ఈ చిత్రంతో కొత్త ఇమేజ్‌ వచ్చి అవకాశాలు వెల్లువలా వచ్చేస్తాయని ఆశ పడిరది.

కానీ యాక్షన్‌ 3డి సినిమాలో ఆమె పాత్ర నిడివి మరీ తక్కువ. కేవలం ఒక్క పాట, నాలుగు సీన్లలో మాత్రమే ఆమె కనిపిస్తుంది. పైగా సినిమా పెద్ద తలపోటు చిత్రమనే పేరు కూడా తెచ్చుకుంది. స్నేహ ఉల్లల్‌ ఎంత కష్టపడి తనలోని గ్లామర్‌ యాంగిల్‌ని చూపించినా కానీ సినిమా సక్సెస్‌ కానపుడు అదంతా వృధానే కాబట్టి యాక్షన్‌ త్రీడీతో ఆమె ఆశలపై సమ్మెట దెబ్బ పడిపోయినట్టే. ఇప్పుడు ఇంకో ఛాన్స్‌ ఇచ్చేదెవరా అని వేచి చూడడం మినహా ఆమె చేసేదేం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English