వీళ్లు ముట్టుకుంటే మసి..!

వీళ్లు ముట్టుకుంటే మసి..!

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకి 2014 పెద్ద పీడకలలా తయారైంది. ఈ ఏడాదిలో వీరు ముట్టుకున్న ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బూడిద అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ... ఇలా భాషకి అతీతంగా వీరు వేలు పెట్టిన ప్రతి చిత్రం అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఈమధ్య కాలంలో అసలు ఫ్లాపులే లేని సల్మాన్‌ ఖాన్‌కి జై హోతో ఏకైక ఫ్లాప్‌ని వీరే ఇచ్చారు. వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతున్న మహేష్‌తో వరుసగా రెండు డిజాస్టర్లు ఈ ఏడాదిలో చేసారు. రజనీకాంత్‌ చేసిన యానిమేషన్‌ సినిమా కొచ్చడయ్యాన్‌తో కోట్లు పోగొట్టుకున్నారు.

హిందీలో రీసెంట్‌గా వచ్చిన రెండు డిజాస్టర్స్‌ హ్యాపీ ఎండింగ్‌, యాక్షన్‌ జాక్సన్‌తో ఈ ఏడాదిలో బాలీవుడ్‌లోనే వీరి ఫ్లాపుల కౌంట్‌ ఏడుకి పెరిగింది. ఇంత భయంకరమైన ఫలితాల్ని చూసిన ఈ ఏడాదిలో ఈరోస్‌ నుంచి చివరిగా వస్తోన్న చిత్రం 'లింగ'. కనీసం దీంతో అయినా ఈరోస్‌ బ్యాడ్‌ టైమ్‌ ఎండ్‌ అవుతుందో లేక సూపర్‌స్టార్‌ కూడా వీరిని గట్టెక్కించలేక చేతులెత్తేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు