సిగరెట్టు కాలుస్తున్న బొద్దుగుమ్మ

సిగరెట్టు కాలుస్తున్న బొద్దుగుమ్మ

బికినీలు వేయను...టూపీస్‌ల్లో కనిపించను..దమ్ము అసలే కొట్టను! అంటూ కలరింగ్‌ ఇచ్చిన సెక్సీ బొద్దుగుమ్మ పరిణీతి చోప్రా గేరు మార్చి, స్పీడు పెంచింది. అవకాశం దొరకాలే గానీ ఒంటిపై నూలుపోగైనా లేకుండా కుర్రాళ్లపై అందాల్ని ఎరవేయడానికి ఎప్పుడో సిద్ధమైపోయింది. తాజాగా దీనికి లింకప్‌గా ‘షుద్‌ దేశీ రొమాన్స్‌’ సినిమాలో సిగరెట్‌ వెలిగించి రింగులు రింగులుగా పొగలు వదులుతోంది అమ్మడు.

 ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బెహల్‌’ సినిమాతో తెరంగేట్రం చేసి, ‘ఇష్క్‌జాదే’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ అమ్మడు ప్రస్తుతం యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ రొమాంటిక్‌ కామెడీ ‘షుద్‌ దేశీ రొమాన్స్‌’లో ఘాటైన సన్నివేశాల్లో నటిస్తోంది. ఈ సినిమాలో సుశాంత్‌ సింగ్‌ హీరో. సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రిలీజ్‌ కానుంది. పట్టు విడుపు ఉంటే సినీపరిశ్రమలో ఏదైనా సాధ్యం అని భావించిందో ఏమో, సొంత నిబంధనలు గాలికొదిలి ఇలా గ్లామర్‌కి సై అంటూనే ధూమపానానికీ సిద్ధమైపోయింది సెక్సీ బొద్దుగుమ్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English