గాసిప్‌ రాస్తే.. డబిడ దిబిడే

గాసిప్‌ రాస్తే.. డబిడ దిబిడే

ఓ టాలీవుడ్‌ అగ్రహీరో గాసిప్‌రాయుళ్లపై తెగ గడబిడ చేస్తున్నాడు. ఎవరైనా తేడా రాస్తే మూయించేస్తున్నాని వార్నింగ్స్‌ ఇచ్చేశాడు. అలాగే ఇతగాడిపై ఇప్పటికే కొన్ని అగ్రపత్రికల్లో వస్తున్న నానా రాతలపై కూడా చాలా కోపంగా ఉన్నాడట. అంతేకాదు గతంలోనూ ఈయనగారికో ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఓమారు ఆస్ట్రేలియాలో ఉన్న ఓ పోరగాడిని అరెస్ట్‌ చేయించడమే అందుకే నిదర్శనం. అయితే అప్పట్లో ఆ కుర్రాడు మీర దారుణంగా పర్సనల్‌గా కామెంట్‌ చెయ్యడంతో అలా చేశారేమో అనుకున్నారు అందరు.

అయితే ఇప్పుడు సదరు హీరో గురించి అనే వెబ్‌సైట్లలో ఇటు సినిమాలపరంగా అటు రాజకీయంగా తిట్టేస్తుంటే, ఆయన బ్లడ్‌ బాయిల్‌ అయిపోయిందట. ఏ వెబ్‌సైట్‌లో ఎక్కడేం వచ్చినా డేగ కంటితో ఓ కంట కనిపెట్టడానికి కొందరు బంధుబలగం పనిచేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇలా వెబ్‌సైట్లను బెదిరించడం, పత్రికలకు వార్నింగులివ్వడం వగైరా పనులు చేసుకుంటూపోతే చివరకు అసలు ఆయన గురించి వార్తలు వ్రాయడానికి ఒక్కళ్ళు కూడా మిగలరని కొంతమంది పెద్దలు హితబోధ చేశారట. ఆవేశం కాస్త చల్లారినట్లు వినికిడి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English