గోపి అమ్మడుని రెండేళ్లు బరించాడట

గోపి అమ్మడుని రెండేళ్లు బరించాడట

సొట్ట బుగ్గలతో, గమ్మత్తైన నవ్వుతో కుర్రకారుని మంత్రముగ్ధం చేసేసే అందాల తాప్సీ, త్వరలో తన అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోనుంది. గోపీచంద్‌కి జోడీగా ఈ అమ్మడు నటించిన ‘సాహసం’ ఈ నెల 28న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ శుభసందర్భాన తాప్సీ ఓ మాట చెప్పింది. గోపి నన్ను రెండేళ్లు భరించాడని అసలు లోగుట్టు విప్పేసింది. నిజమే మరి. ‘మొగుడు’ సినిమాతో ఈ జోడీ ప్రయాణం మొదలైంది. అది సాహసం చేసేంతవరకూ వచ్చింది. అయితే ఈ సాహసం ఇద్దరికీ కలిసొస్తుందో లేదో తెలీదు కానీ, ఇప్పటికైతే ఇద్దరికీ ఈ సినిమా చాలా  కీలకం.

తాప్సీ అరడజను సినిమాల్లో నటించేసినా, ఇంతవరకూ ఒక్క హిట్టూ కొట్టలేదు. గోపీ కూడా వాంటెడ్‌ లాంటి అట్టర్‌ప్లాప్‌తో డీలాపడిపోయాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ గట్టెక్కించే సినిమా సాహసం కావాలి. హిట్టు మాట అటుంచితే..అసలు గోపీ రెండేళ్లు తనని భరించాడనడంలో అర్థమేమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే అమ్మడు రెండేళ్లు గోపీని టార్చర్‌ చేసిందనా? లేక మొగుడు సినిమా పూర్తయి సాహసం రిలీజ్‌కొచ్చేసరికి రెండేళ్లు దాటేసిందనా? తాప్సీ ఉద్ధేశమేదైనా...గాసిప్‌రాయుళ్లకు కాస్త ఊతం ఇచ్చినట్టైంది. దీనిని బట్టి ఎవరి కథలు వాళ్లు అల్లేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English