సుధీర్ వాడకం ఇలా ఉంటుందా!

 సుధీర్ వాడకం ఇలా ఉంటుందా!

బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన హీరోగా నిలదొక్కుకుంటామన్న గ్యారంటీ ఉండదు. తండ్రులు పెద్ద హీరోలు, దర్శకులు అయినా చతికిలపడిన వారసులు ఉన్నారు. తనకు మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని ముందే జాగ్రత్త పడుతున్నాడు సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేశ్ బాబు బావగా బలమైన బ్యాగ్రౌండ్ తోనే బరిలోకి దిగాడు కుర్రోడు.

తొలి సినిమాలో సరిగ్గా నటించలేకపోయాడని అనిపించుకున్నా, రెండో సినిమా 'ప్రేమకథా చిత్రమ్'తో మంచి పేరే తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కృష్ణ ఇమేజ్ ని బాగా వాడాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మామగారి చేత పొగిడించుకున్నాడు. సినిమా రిలీజై హిట్టయ్యాక మరోసారి ఆయన ప్రశంసలు కొట్టేశాడు. తర్వాత ఇంటర్వ్యూ ఇస్తూ ఏకంగా అల్లూరి సీతారామరాజు రీమేక్ లో చేయాలనుంది అంటూ స్థాయికి మించి మాట్లాడాడు.

ఇప్పుడు ఏకంగా తన సినిమాకి మామగారి సినిమా పేరును తెచ్చి తగిలించేశాడు. ప్రేమకథా చిత్రమ్ లోకృష్ణ హిట్ సాంగును రీమిక్స్ చేసి పెట్టారు. అది బాగా క్లిక్కయ్యింది. దాంతో సెంటిమెంట్ ఫీలయ్యాడో ఏమో, కొత్త దర్శకుడు హనుమాన్ తో చేస్తోన్న సినిమాకి 'మాయదారి మల్లిగాడు' అనే టైటిల్ ని తనే ఫిక్స్ చేసేశాడు. ఆ పేరు పెడితే హిట్టు గ్యారంటీ అని చెప్పి దర్శక నిర్మాతలను ఒప్పించేశాడు. అతడి తీరు చూసినవాళ్లంతా మామగారి ఇమేజ్ ని ఏం వాడేస్తున్నావయ్యా అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. మొత్తానికి సుధీర్ తక్కువోడు కాదు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English