అతడికింకా ఆశ చావలేదు!

అతడికింకా ఆశ చావలేదు!

 తీస్తున్న సినిమాలన్నీ పరాజయాల బాట పడుతున్నా, అతడి సినిమాని కొనడానికి బయ్యరనేవాడెవడూ ముందుకు రాకపోయినా, ఏమాత్రం లెక్కచేయకుండా సినిమాలు తీసే హీరో ఎవరైనా ఉన్నారు అంటే... అది కేవలం రాజశేఖరే. ఇది ఏ ఒక్కరో అంటున్న మాట కాదు. ఇండస్ట్రీలో అందరూ అంటోన్న మాట. రాజశేఖర్ కి మార్కెట్ పడిపోయి చాలా కాలమయ్యింది. అయినా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాడు. దానికి తోడు జీవిత డైరెక్షన్. వీరిద్దరికీ విడివివిగా గానీ, కాంబినేషన్ గా గానీ ఎలాంటి క్రేజూ లేదు. వీరి సినిమాలు చూడాలన్న ఆసక్తి కూడా ఎవరికీ లేదు. అయినా కూడా ప్రయోగాలు చేస్తూ, నష్టపోతూ ఉన్నారు.

మహంకాళి సినిమాని విడుదల చేయడానికి వాళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తీరా విడుదలయ్యాక రెండు మూడు రోజులకే థియేటర్ నుంచి తప్పుకుందా సినిమా. అయినా కూడా పిలిచిన ప్రతి చానెల్ కీ వెళ్లి, సినిమా బాగా ఆడేస్తోందని, ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయాలని ఫిక్సయ్యామనీ చెప్పుకున్నారీ జంట. కానీ వాళ్లింకెక్కడ సినిమా తీస్తార్లే అనుకున్నారు జనం. కానీ వాళ్లు అంత త్వరగా తప్పుకునే టైపు కాదు. ఎందుకంటే మరో సినిమా తీసే పనిలో అప్పుడే బిజీ అయిపోయారు. తమిళంలో హిట్టయిన ఓ సినిమాని తెలుగులో తీసేయాలని డిసైడైపోయారు. రీమేకులు చేయడంలో మాంచి అనుభవం ఉన్న ముప్పలనేని శివ దర్శకత్వం వహించబోతున్నాడట. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి నిర్మాత దొరకలేదని సమాచారం. చివరి వరకూ ప్రయత్నించి, ఫలితం లేకపోతే రాజశేఖరే సొంత బ్యానర్ మీద తీసేయాలని అనుకుంటున్నాడట. అంత రిస్కు అవసరమా రాజశేఖరా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English