చరణ్ కోరిక తీరేనా!

చరణ్ కోరిక తీరేనా!

ప్రస్తుతం మల్టీ స్టారర్ల మీదే హీరోలందరికీ మనసు పోతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మొదలైన ఈ గొడవ ఇప్పుడప్పుడే చల్లబడేలా లేదు. హీరోలంతా మల్టీ స్టారర్లు చేసెయ్యాలని తహతహలాడిపోతున్నారు. ఇప్పటికే వెంకటేష్ ఒకట్రెండు సినిమాల్లో వేరే హీరోలతో చేసేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో కలసి పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదని మహేశ్ బాబు తేల్చేశాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా 'మనం'తో బిజీగా ఉన్నారు. మంచు వారి ఫ్యామిలీ అంతా మూకుమ్మడిగా ఓ సినిమా చేసేస్తోంది. ఇవన్నీ చూసి మనసు పడ్డాడో ఏమో కానీ... రామ్ చరణ్ మనసులో కూడా మల్టీ స్టారర్ చేయాలనే కోరిక ఉంది. ఆ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడీ మధ్య.

 అలాగని అందరు హీరోలతో కాదు. తన బాబాయి, బావ బన్నీలతో మాత్రమే. వాళ్లిద్దరితో కలసి నటించాలనుంది, మంచి కథ ఎవరైనా తెస్తే చేయడానికి నేను రెడీ అంటూ తన తహతహని బయటపెట్టాడు. అర్జంటుగా కాకపోయినా కొన్నాళ్ల తర్వాతయినా ఫర్వాలేదట. అలాంటి కథ తెస్తే తప్పకుండా చేస్తాడట. చరణ్ మాట విని మెగా ఫ్యాన్స్ అప్పుడే కలల్లో తేలిపోతుంటే, అలాంటి కథ నూరేయడానికి రచయితలు, దర్శకులు ప్రిపేరయిపోతున్నారు. చరణ్ గారి కోరిక ఎప్పుడు తీరుతుందో మరి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English