నితిన్‌ బ్యూటీ.. హాట్‌ ప్రాపర్టీ

నితిన్‌ బ్యూటీ.. హాట్‌ ప్రాపర్టీ

దర్శకుడు కరుణాకరన్‌ ఆహ్లాదకరమైన సినిమాలు తీయడంలోనే కాదు, అందమైన హీరోయిన్లను ఇంకా అందంగా చూపించడంలోనూ సిద్దహస్తుడు. కరుణాకరన్‌ కొత్త డిస్కవరీ మిస్తి చక్రవర్తి. ఈ బెంగాలీ బ్యూటీ హిందీలో 'కాంచి' అనే సినిమాలో నటించింది. 'పరిచయ్‌' అనే బెంగాలీ సినిమాలో కూడా నటించిన మిస్తి... తెలుగులో 'చిన్నదాన నీకోసం' సినిమాలో నితిన్‌తో కలిసి నటిస్తోంది.

కరుణాకరన్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ రిచ్‌గానే ఉన్నాయి. క్లాస్‌ అప్పీల్‌తో కన్పిస్తోన్న ఈ సినిమాలో మిస్తిని కరుణాకర్‌ ఎంతందంగా చూపించాడో టీజర్స్‌ చూస్తే తెలుస్తుంది. టీజర్స్‌ రాగానే మిస్తికి టాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ఆఫర్లు మొదలయ్యాయట. అందంతోపాటు, నటనలోనూ మిస్తి 'కాంచి' సినిమాతో బాగానే స్కోర్‌ చేసింది. ఎటూ టాలీవుడ్‌కి హీరోయిన్స్‌ కొరత ఉంది. దాంతో మిస్తి ఫ్యూచర్‌లో టాలీవుడ్‌కి హాట్‌ ప్రాపర్టీగా మారే అవకాశం వుందని గెస్‌ చేస్తున్నాయి టాలీవుడ్‌ సర్కిల్స్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English