ఆ ఇద్దరి కెమిస్ట్రీని కొట్టేదే లేదు

ఆ ఇద్దరి కెమిస్ట్రీని కొట్టేదే లేదు

స్క్రీన్‌పై హీరో హీరోయిన్స్‌ మధ్య కెమిస్ట్రీ అంత బాగా పండితే ఆ సినిమా అంత హిట్‌ అవుతుందంటారు. దానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అంటే 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయెంగే'. అందులో షారుక్‌, కాజోల్‌ మధ్య కెమిస్ట్రీ ఆ పదానికే డెఫినిషన్‌లా నిలిచింది. సినిమా వచ్చి ఇరవయ్యేళ్లు అయ్యింది.. కాజోల్‌కి పెళ్ళయిపోయింది.. షారుక్‌కి కూడా పెళ్ళయింది.. కానీ వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం అలానే ఉంది. ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే కాదు... ఈ ఇద్దరూ ఆఫ్‌ స్క్రీన్‌లో కలిసినా కానీ ఆ వైబ్‌ అయితే అలాగే ఉంటుంది.

'దిల్‌ వాలే దుల్హనియా లేజాయెంగే' సినిమా విడుదలై వెయ్యి వారాలు (అంటే ఏడు వేల రోజులు) పూర్తవడంతో, సినిమా యూనిట్‌ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ని ప్లాన్‌ చేసుకుంది. ఈ గ్రేట్‌ ఈవెంట్‌ని ప్రమోట్‌ చేయడానికి 'కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌' అనే ఓ టీవీ షోలో కాజోల్‌, షారుక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. కాజోల్‌ చేతిని నిమురుతూ షారుక్‌, షారుక్‌ భుజంపై చెయ్యేస్తూ కాజల్‌ షో టైమ్‌ని మేగ్జిమమ్‌ ఎంజాయ్‌ చేశారు. 'వి ఆర్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌..' అని చెప్పకనే చెప్పారు. ఈ కాంబినేషన్‌లో మళ్లీ ఒక సినిమా వస్తే చూడాలని వారి అభిమానులు కోరుకోవడంలో వింతేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English