'గోపాల గోపాల'కి లింకెట్టి బాగా లాగేసాడు

'గోపాల గోపాల'కి లింకెట్టి బాగా లాగేసాడు

సీనియర్‌ నిర్మాత సురేష్‌బాబు ఈమధ్య చాలా అరుదుగా మాత్రమే సినిమాలు నిర్మిస్తున్నారు. తన సినిమాలని ఆచి తూచి సెలక్ట్‌ చేసుకునే సురేష్‌బాబు వాటిని చాలా బాగా మార్కెట్‌ చేసుకుంటారు. అందుకే ఆయనకి చాలా తక్కువ సినిమాలతో మాత్రమే నష్టాలొచ్చాయి. ఇద్దరు స్టార్‌ హీరోలని పెట్టి సినిమా తీసినపుడు దానినుంచి మాగ్జిమం ఎలా పిండాలో సురేష్‌కి తెలుసు. 'గోపాల గోపాల' చిత్రాన్ని ఆయన అదిరిపోయే రేట్లకి అమ్ముతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ కంటే... దాని స్పాన్‌ కంటే పవన్‌, వెంకీ కాంబినేషన్‌ని ఆయన క్యాష్‌ చేసుకుంటున్నారు.

శాటిలైట్‌ రైట్స్‌ విషయంలో కూడా సురేష్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసారు. గోపాల గోపాల చిత్రాన్ని సోలోగా అమ్మకుండా... దానికి తోడుగా తనే నిర్మించిన దృశ్యం, భీమవరం బుల్లోడు చిత్రాలని కూడా కలిపేసి గుత్తంగా ఒకేసారి అమ్మేశారు. ఈ చిత్రాల్ని గుత్తంగా ఇరవై కోట్ల రూపాయలకి జెమిని టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాల్ని విడివిడిగా అమ్మినట్టయితే ఖచ్చితంగా ఇరవై కోట్లు రావు. కానీ సురేష్‌బాబు తెలివిగా ఇంకా రిలీజ్‌ కాని, ఫలితం ఏమిటో తెలియని 'గోపాల గోపాల' సినిమాకి లింక్‌ పెట్టేసి తన గత చిత్రాల్ని కూడా మంచి బేరానికి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు