మారుతి..కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతోంది!

మారుతి..కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతోంది!

పేరుకు బూతు సినిమాలు అయితేనేం...వరసగా హిట్ అవుతున్నాయి, డబ్బులు బాగానే వస్తున్నాయి... దీంతో దర్శక నిర్మాత దాసరి మారుతికి ఆత్మవిశ్వాసం కాస్తంత పెరిగినట్టు ఉంది. కేవలం దర్శకుడిగానే కాకుండా.. శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హిట్ సినిమాలు చేస్తున్న మారుతి తన కన్నా పోటుగాడు ఎవడూ లేనట్టుగా మాట్లాడుతున్నారిప్పుడు.

 తనను గతంలో తక్కువ అంచనా వేసిన వారి విషయంలో ఇప్పుడు మారుతి రీవేంజ్ స్టార్ట్ చేశారు. తనను గతంలో ఒక దర్శకుడు చిన్నచూపు చూశాడని అతడితో ఛాలెంజ్ చేసే తాను 'ఈరోజుల్లో' సినిమాను కేవలం 50 లక్షల రూపాయలతో పూర్తి చేశానని మారుతి చెప్పుకొచ్చాడు. ఆ సినిమా లో బడ్జెట్ తో రావడమే గాక సూపర్ హిట్ కూడా అవ్వడంతో తానేంటో అందరికీ అర్థం అయ్యింది అన్నట్టుగా మాట్లాడాడు ఈ దర్శకుడు.

 మారుతి ఉత్సాహం మాట ఎలా ఉన్నా...సినీ ఇండస్ట్రీ అన్నాక తన కింద స్థాయిలో పనిచేసే వారిని చిన్న చూపు చూడటం చాలా మామూళు విషయమేనేమో! ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి మారుతి ఇలా ఒక వేదికపై నుంచి  తనను అవమానించిన వారిపై మాటలతో ప్రతీకారం తీర్చుకొంటున్నాడు. వరస హిట్స్ తో తన మనసులో పురివిప్పిన ఆత్మవిశ్వాసాన్ని మారుతి బయటకు ప్రదర్శిస్తున్నాడు. అయితే తాను చాలెంజ్ చేసింది ఏ దర్శకుడితోనో అనే విషయం గురించి చెప్పకుండానే ప్రసంగాన్ని ముగించాడు మారుతి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English