ఆ హీరోతో కత్రినా రెండో విడత ప్రేమయాణం!

 ఆ హీరోతో కత్రినా రెండో విడత ప్రేమయాణం!

కొన్ని రోజుల కిందట కత్రినాకైఫ్ కు రణ్ బీర్ కపూర్ కు బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారి మధ్య తిరిగి కనెక్షన్ ఏర్పండిందనేది తాజా కబురు. ప్రస్తుతం తన సినిమా సూపర్ హిట్ అయ్యి రెండువందల కోట్ల రూపాయల కలెక్షన్ల స్థాయికి దూసుకుపోవడంతో ఉత్సాహంతో ఉన్న రణ్ బీర్ కపూర్ మొన్నటి సాయంత్రాన్ని కత్రినాతో కలిసి సరదాగా గడిపారట. ముంబై ఔట్ స్కర్ట్స్ లో వీరు రొమాన్స్ చేసుకోవడాన్ని అనేక మంది గమనించారట. ప్రత్యేకించి ఆ ప్రాంతంలోని రిక్షాల్లో కూర్చుని ఈ హీరోహీరోయిన్లు నిజ జీవిత రొమాన్స్ ను ఆస్వాదించారట. తెల్లవారే వరకూ అక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్లారట.

 ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మొదట్లో కత్రినా-రణ్ బీర్ మధ్య ఎఫైర్ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రణ్ బీర్ దీపికతో పెయిరప్ అయ్యాడని అన్నారు. ఆదిలో సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా మెలిగి... ఆతర్వాత అతడిని పూర్తిగా వదిలించుకున్న కత్రినా తన కన్నా చిన్నవాడే అయిన రణ్ బీర్ తో చాలా హ్యాపీగా గడిపేస్తోంది. మధ్య లో  బ్రేకప్ వార్తలు వచ్చినప్పుడు సైలెంట్ గానే ఉండిపోయిన ఈమె ఇప్పుడు మళ్లీ కపూర్ ల కుర్రాడితో ఖేల్ షురూ చేసిందని బాలీవుడ్ ను కవర్ చేసే మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. మరి దీనికి కత్రినా, రణ్ బీర్ లు ఏమని వివరణ ఇస్తారో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English