ఉత్సాహంతో పప్పులో కాలేసిన ప్రియమణి!

ఉత్సాహంతో పప్పులో కాలేసిన ప్రియమణి!

బాలీవుడ్ బాద్ షా కు కృతజ్ఞతలు చెప్పుకోవడంలో ప్రియమణి మరీ ఎక్కువ ఉత్సాహం చూపించినట్టుంది. ఆ తొందరలో పప్పులో కాలేసింది. తప్పు స్పెల్లింగ్ రాసి..అందరినీ అవాక్కయ్యేలా చేసింది, ఆ వెంటనే నాలుక్కరుచుకుని తప్పు సరిదిద్దుకుంది. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే... షారూఖ్ ఖాన్ సినిమా 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రచారకార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఆ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు. దీనిపై ప్రియమణి స్పందించింది. ట్విటర్ లో తన స్పందన వ్యక్తం చేస్తూ, ఆమె ఉక్కిరబిక్కిరి అయిపోతూ స్పెల్లింగ్ తప్పుగా టైప్ చేసి ఒక ట్వీట్ ఇచ్చింది. ‘‘థాంక్స్‌ టు డేట్‌ విత్‌ యు’’ అంటూ బాద్‌షాని ఉద్ధేశించి ఇటీవల ట్వీట్్పోస్టు చేసింది ప్రియమణి. దీన్ని చదివి అవాక్కవ్వడం ప్రియమణి ట్విటర్ ఫాలోవర్ల వంతు లయ్యింది. ఇదేమిటీ..ప్రియమణి షారూక్ తో డేటింగ్ చేస్తోందా? పెళ్లై పిల్లులున్న షారూక్ కు ఇదేం పో యే కాలం, ప్రియమణికి ఇదేం గ్రహచారం అనుకుంటూ.. ప్రియమణి, షారూక్ ల గురించి నానా తిట్లూ తిట్టుకున్నారంతా.

ఇంకొందరు ఈ ఎఫైర్ బాగానే ఉందనుకున్నారు. అయితే... తాను పప్పులో కాలేసినట్టు గుర్తించింది ప్రియమణి. పొరపాటను సవరించుకుంటూ,,,''థ్యాంక్స్ టూ డ్యాన్స్ విత్ యూ..'మళ్లీ పోస్టు పెట్టింది. డాన్స్ కు డేట్ కు అక్షరాల క్రమం చాలా దగ్గరగా ఉన్నా... మీనింగుల్లో చాలా తేడా ఉంది కాబట్టి... ఇలాంటి ప్రమాదం జరిగింది. మరి ఇకనైనా ప్రియమణి ట్వీట్ల విషయంలో కాస్తంత జాగ్రత్త వహిస్తే మంచిదేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English