ఆంటీకి అంకుల్‌ బ్రేకిస్తాడా?

ఆంటీకి అంకుల్‌ బ్రేకిస్తాడా?

బాలీవుడ్‌లో ఇప్పుడు అంకుల్‌ సల్మాన్‌ఖాన్‌ మట్టి పట్టుకుంటే బంగారం అవుతోంది. ఎలాంటి చెత్త చిత్రంతో అయినా కానీ వంద కోట్ల పైగా వసూళ్లు అవలీలగా సాధించేస్తున్న సల్మాన్‌ఖాన్‌కి ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా నిర్మాతలు వెనుకాడడం లేదు. అలాగే సల్మాన్‌ హ్యాండ్‌ పడితే రాయి రత్నమవుతోంది కనుక అతనితో ఒక్క సినిమా చేయాలని హీరోయిన్లు అతని వెంట పడిపోతున్నారు.

సల్మాన్‌ని వదలకుండా తిరుగుతున్న హీరోయిన్లలో శ్రియ ముందు వరసలో ఉంది. దాదాపు ఏడాది కాలంగా సల్మాన్‌ వెంటే తిరుగుతూ, అతని కరుణ కోసం వేచి చూస్తూ, సల్మాన్‌ సేవలో తరిస్తున్న శ్రియని సల్లూభాయ్‌ వేరే వారికి రికమండ్‌ చేస్తున్నాడు. కాకపోతే ఇవన్నీ చిన్న సినిమాలే. ఇలాంటి గల్లీ సినిమాలు కాకుండా డైరెక్టుగా సల్లూ సరసనే ఆఫర్‌ వస్తే తప్ప శ్రియ కెరీర్‌ ఊపందుకోదు. ఆ అదృష్టం ఆమెకి అతను ఎప్పుడు కల్పిస్తాడో ఏమో? సల్మాన్‌లానే శ్రియకి కూడా ఏజ్‌ బార్‌ అయిపోతోంది పాపం.

ముప్పయ్యేళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమాలప్రపంచంగా బ్రతుకుతున్నందుకు మాత్రం శ్రియ అంకిత భావాన్ని మెచ్చుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు