పేరుకే డైరెక్టర్... అంత కళ్యాణ్ బాబే!!

పేరుకే డైరెక్టర్... అంత కళ్యాణ్ బాబే!!

పేరుకే మనోడు. అంతా కళ్యాణ్‌బాబే!! ప్రస్తుతం ఫిలింనగర్‌ సర్కిల్స్‌లో సాగుతున్న ఆసక్తికర చర్చ ఇది. ఇంతకీ విషయమేమంటే ‘గబ్బర్‌సింగ్‌’ విజయంతో మాంచి ఖుషీమీదున్న పవన్‌ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌ విషయంలో పూర్తిగా దృష్టిపెట్టాడు. గబ్బర్‌సింగ్‌ 2 (బెంగాల్‌ టైగర్‌ అనుకుంటున్నారు)ని సొంత బేనరు పవన్‌కళ్యాణ్‌ ఆర్ట్స్‌లోనే స్వీయనిర్మాణంలో గ్రాండ్‌గా ప్రారంభించేశాడు. ఈ సినిమాకి కథ, డైలాగులు కూడా పవన్‌ బాబే స్వయంగా సమకూర్చాడు. ఆపై దర్శకుడిగా ‘రచ్చ’ ఫేం సంపత్‌నందికి అవకాశమిచ్చాడు.

అయితే ఇప్పుడు డైరెక్షన్‌ కూడా పవనే చేసేస్తున్నాడనేది మెగా క్యాంప్‌లో ఉన్న జేమ్స్‌బాండ్స్‌ ద్వారా అందిన సమాచారం. సంపత్‌నంది అనే పేరును టైటిల్స్‌లో వాడుకోవడానికి మినహా అతగాడు చేసేదేమీ లేదనీ అంటున్నారు. పైగా ఈ సినిమాలో స్టంట్స్‌ కూడా మనోడటే. ఇక నిర్మాత కూడా ఆయనే కాబట్టి, ఖచ్చితంగా ఏదైనా చెయ్యొచ్చు. ఈ లెక్కన చూస్తే సంపత్‌ సినిమాలో మన పవర్‌స్టార్‌ హోల్‌సవ్‌ు యాక్టింగ్‌, డైరెక్టింగ్‌, రైటింగ్‌ అన్నిట్లోనూ వేలు పెట్టేస్తాడే ఏంటి? ఎందుకు ‘జాని’ ఇలాంటి ఫీట్లు!!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English