యాక్షన్‌ కాదు.. ఓవరాక్షన్‌!!

యాక్షన్‌ కాదు.. ఓవరాక్షన్‌!!

అల్లరి నరేష్‌ సినిమా అంటే ఫుల్‌ కామెడీ ఉంటుంది. కడుపుబ్బా నవ్వుకోవాలని ప్రేకులు ఫిక్స్‌ అయ్యి థియోటర్‌కి వెళతారు. అందుకే నరేష్‌ సినిమాలు హిట్‌, ప్లాప్‌లతో నిమిత్తం లేకుండా మినిమం గ్యారెంటీగా ఆడేస్తూంటాయి. అయితే అనిల్‌ సుంకర ‘యాక్షన్‌ 3డి’ స్క్రీన్‌ప్లే లోపంతో అంచనాల్ని తలకిందులు చేసింది. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్లు కాస్తా రియాక్షన్‌కు గురై సినిమా మొత్తం ఓవరాక్షన్‌గా మిగిలిపోయిందని విమర్శలస్తున్నాయి.  హీరోయిన్ల ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌, విదేశీ ముద్దుగుమ్మల బికినీ షోలు మినహా ఈ సినిమాలో ఏం లేదనే చెప్పాలి.

 హాలీవుడ్‌ మూవీ ‘హ్యాంగోవర్‌’కు ఫ్రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం  ఏ దిశ, దశలేని కథాగమనంతో ఆద్యంతం సినిమా దారితప్పింది. ఫ్లాష్‌బ్యాక్‌లోనుంచి మరో ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లే సీన్లు గందరగోళంలో పడేస్తాయి. ఫస్ట్‌హాప్‌ చూస్తే చాలా సినిమాల్లో వాడేసిన డైలాగులో వినిపిస్తాయి కాని, సెకండ్‌హాఫ్‌ మాత్రం పూర్తిగా మూగ సినిమానే. .వెరైటీ కోసం క్లైమాక్స్‌  ఫైట్‌ అయిపోయాక సీన్స్‌, పాట ఇలా అతుకుల బంతలా ఉందీ సినిమా.

 సీనియర్స్‌.. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ వంటివారు ఉన్నా సినిమాకు ఏమీ ప్లస్‌ కాలేదు. అలాగే దూకుడు సినిమాలో ఎమ్మెస్‌ నారాయణ పాత్ర బక్కా వెంకట్రావు పాత్రను ఈ చిత్రంలో కొనసాగింపుగా ఉంది. కాగా రిపీట్‌ అయిన ఫీలింగ్‌ వచ్చిందే కాని ఏమాత్రం హాస్యం పండలేదు. మొత్తానికి అనీల్‌ సుంకర ఏదో అనుకుని, ఇంకేదో చేసి తన చెయ్యిని తానే కొరుక్కున్నాడని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English