కృష్ణారెడ్డి కొంప ముంచాడట!

కృష్ణారెడ్డి కొంప ముంచాడట!

ఈ మధ్య ఆర్.ఆర్.బ్రదర్స్ హవా బాగా తగ్గిపోయింది. వాళ్ల సినిమాలు విడుదలవడానికి పురుటినొప్పులు పడుతూ నానా హంగామా చేస్తున్నాయి. దానికి కారణం ఏమిటా అని అంతా రకరకాలుగా చర్చించుకున్నారు. అయితే అసలు కారణం ఏంటో ఇప్పడు తెలిసివచ్చింది. వాళ్ల కష్టాలకు కారణం ఎస్వీ కృష్ణారెడ్డి. అతగాడు హాలీవుడ్ చిత్రం ఒకటి కమిటయ్యాడు తెలుసుగా! శుభలగ్నం సినిమాని 'వెడ్డింగ్ ఇన్విటేషన్'గా ఇంగ్లిష్ లో తీశాడు. అయితే గతంలో మనవాళ్లెవరైనా ఇంగ్లిష్ సినిమా తీస్తే, అందులో మన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉండేవారు.

కానీ కృష్ణారెడ్డి పూర్తిగా హాలీవుడ్ కాస్ట్ అండ్ క్రూనే తీసుకున్నాడట. దాంతో బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. ఎంతయి ఉంటుందనుకుంటున్నారు! అక్షరాలా వంద కోట్లు. దానివల్లే ఆర్.ఆర్. వాళ్లు అప్పుల్లో కూరుకుపోయారని అంటున్నారు. అయితే ఇప్పటికే గ్రీస్, బెల్జియం దేశాల్లో విడుదలైన ఈ సినిమా బాగా ఆడుతోందట. మిగతా చోట్ల కూడా బాగా వసూలు చేస్తే నిర్మాతల కష్టం తీరిపోతుందని అంటున్నారు. వసూలు చేస్తే గట్టెక్కేస్తారు సరే. ఒకవేళ వసూలు చేయకపోతే ఏంటి పరిస్థితి! అయినా ఓ మామూలు సినిమాకి వంద కోట్లు ఏ ధైర్యంతో పెట్టారో ఏమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English