విక్రమ్ కి అది అచ్చి రాదేమో!

విక్రమ్ కి అది అచ్చి రాదేమో!

డిఫరెంట్ సినిమాలు చేసి, విలక్షణ నటుడు అని పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ఎడా పెడా సినిమాలు చేసేయకుండా, జాగ్రత్తగా ఎంచుకుని మరీ సినిమాలు చేస్తుంటాడు. పెద్ద దర్శకులు ప్రయోగాలు చేయాలనుకుంటే, ముందుగా మదిలో మెదిలే టాప్ ౩ హీరోల్లో అతడూ ఉన్నాడు. మిగతా ఇద్దరూ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. ప్రస్తుతం విక్రమ్ 'ఐ' చిత్రంలో చేస్తున్నాడు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే కదా!

ఈ సినిమా కోసం విక్రమ్ ని బాగా బరువు తగ్గమని చెప్పాడు శంకర్. దానికోసం టైము కూడా ఇచ్చాడు. దాంతో మనోడు తెగ కష్టపడిపోయి బరువు తగ్గిపోయాడు. తీరా అతణ్ని చూశాక శంకర్ జడుసుకున్నాడు. తగ్గమంటే మరీ ఇంతా, కాస్త కండపట్టి కనిపించు అన్నాడట. మళ్లీ మనోడు కసరత్తు చేసి, ఎంత కావాలో అంత బాడీతో శంకర్ ముందుకు వచ్చాడు. అయితే అతగాడు 25 కిలోలయితే తగ్గాడు.

ఈ కష్టమంతా ఎందుకయ్యా అంటే... ఈ సినిమాలో అతగాడు అయిదు గెటప్స్ లో కనిపిస్తాడట. దానికోసం బరువు తగ్గక తప్పదట. అంతా బాగానే ఉంది కానీ, విక్రమ్ అయిదు గెటప్పులు వేస్తాడంటే కాస్త ఆలోచనలో పడుతున్నారు జనం. అతగాడు రకరకాల వేషాలేసిన మల్లన్న సినిమా చూశాంగా! వేషాలెక్కువ, విషయం తక్కువ అన్నట్టుగా ఉందా సినిమా. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో! మల్లన్నలో అచ్చిరాని గెటప్పులు ఐ లో కలిసొస్తాయా! శంకర్ సినిమా కాబట్టి బాగానే ఉండొచ్చేమో. ఆ నమ్మకంతోనే ఎదురుచూద్దాం 'ఐ' సినిమా కోసం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English