అంతర్జాతీయస్థాయిలో అంటున్న రాజమౌళి!

అంతర్జాతీయస్థాయిలో అంటున్న రాజమౌళి!

ఒకటి కాదు... త్వరలోనే తన రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో, వివిధ దేశాల్లో విడుదల కాబోతున్నాయని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించారు. తన సినిమాలను అనేక దేశాల  ప్రజల కోసం స్థానిక భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు సాగుతున్నాయని రాజమౌళి తెలిపారు. ముందుగా తెలుగు లో సంచలనాత్మక విజయం సాధించిన 'ఈగ' ను ఈ ఏడాది చివరికళ్లా చైనాలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాను 'కుంగ్ ఫూ హౌస్ ఫ్లై' పేరుతో చైనీ భాషలోకి డబ్బింగ్ చేస్తున్నామని రాజమౌళి ట్విటర్ లో తెలిపారు.

ఇక తాను రూపొందించబోయే 'బాహుబలి' ని కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత శోభు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమౌళి ప్రకటించారు. ఈ విషయాలను వివరిస్తూ రాజమౌళి తాజాగా ట్వీట్లను ఇచ్చారు. మరి వీటిని బట్టి రాజమౌళి స్థాయి ఇక అంతర్జాతీయ రేంజ్ కు చేరినట్టేనని అనుకోవాలేమో! ఇప్పటికే ఈ దర్శకుడికి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆమీర్ ఖాన్ తో సినిమా చేస్తాడు అనేంత వరకూ వెళ్లింది రాజమౌళి పేరు. అయితే అవి ఇంకా కార్యరూపం దాల్చకుండానే తన సినిమాలతో అంతర్జాతీయ సినీ ప్రేమికులలో గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు ఈ తెలుగు దర్శకుడు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English