ఫ్యామిలీ ఆడియన్స్ కు డర్టీగర్ల్ స్వాగతం!

 ఫ్యామిలీ ఆడియన్స్ కు డర్టీగర్ల్  స్వాగతం!

విద్యాబాలన్'గన్ చక్కర్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీన్ని బట్టి ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ప్రవేశం ఉందని అర్థం అవుతోంది. ఈ సినిమాలో విద్యాబాలన్ డర్టీపిక్చర్ కన్నా హాట్ గా కనిపిస్తుందని అన్నారు. విద్య కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 'డర్టీపిక్చర్' కంటే 'గన్ చక్కర్ ' లో హాట్ హాట్ గా కనిపించబోతున్నానని విద్య చెప్పుకొచ్చింది. అందులోనూ ఈసినిమాలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ హీరో కావడంతో... ముద్దు సీన్లకు లోటుండకపోవచ్చు అనుకున్నారంతా.

విద్య కూడా ఈ విషయంలో హీరోలకు, దర్శకులకు బాగా సహకరిస్తోంది ఈ మధ్య. ఇలాంటి పరిణామాలన్నింటి నేపథ్యంలో 'గన్ చక్కర్' పై అందరి అంచనాలూ హాట్ హాట్ గానే సాగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రావడంతో రొమాన్స్ పాళ్లు కొంత మేర తగ్గిందేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ..తాము 'గన్ చక్కర్' కు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా స్వాగతం పలుకుతున్నామని అన్నారు. మరి 'గన్ చక్కర్' అసలురూపం ఏమిటో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English