తేడా అయితే మసి.. మసైపోతారంతే!

తేడా అయితే మసి.. మసైపోతారంతే!

నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రజనీకాంత్‌ తెరపై కనిపిస్తున్నాడని 'లింగ' సినిమాని వెనకా ముందు చూడకుండా కొని పారేస్తున్నారు. రజనీకాంత్‌ 'రోబో'ని దృష్టిలో పెట్టుకుని 'లింగ' చిత్రంపై విపరీతంగా బిజినెస్‌ జరిగింది. ఎంత జరిగిందంటే... 250 కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తే ఈ సినిమా సేఫ్‌ అవుతుందట. దీనికి శంకర్‌ మ్యాజిక్‌ తోడు లేదనే సంగతి విస్మరించి కేవలం రజనీ మేనియాపై ఇంత ఇన్వెస్ట్‌ చేసి పారేసారు.

కె.ఎస్‌. రవికుమార్‌ సినిమా అంటే ఏసీ, డీసీ టైప్‌లోనే ఉంటుందనేది తెలియనిది కాదు. ఏమాత్రం తేడా అయినా కానీ ఇంత పెద్ద మొత్తానికి కొన్న బయ్యర్లు మసి అయిపోతారు. రజనీకాంత్‌ ఏమీ ఫ్లాప్‌లకి అతీతుడు కాదు. ఆయన కూడా బాబా, కథానాయకుడు లాంటి ఘోరమైన ఫ్లాపులిచ్చాడు. అయినప్పటికీ హిట్టు సినిమాలని మాత్రమే దృష్టిలో ఉంచుకుని 'లింగ'ని ఇలా కొని పారేసారు. పైగా ఈ చిత్రం సంక్రాంతికో, సమ్మర్‌కో, మరో పండక్కో కూడా రావడం లేదు. ఏదో పబ్లిక్‌ హాలిడే అన్నట్టు రజనీకాంత్‌ బర్త్‌డేకి దీనిని రిలీజ్‌ చేస్తున్నారు. హాలిడేస్‌ లేని టైమ్‌లో వచ్చి ఈ చిత్రం అన్ని కోట్లు రాబట్టాలంటే అల్లాటప్పాగా ఉంటే సరిపోదు... అద్భుతం అనిపించాలి. ఇది అంతటి మహా లింగమో లేక బోడి లింగమో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు