రాజేంద్రప్రసాద్ టైటిల్ తో మెగా హీరో ఎంట్రీ?!

రాజేంద్రప్రసాద్ టైటిల్ తో మెగా హీరో ఎంట్రీ?!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తనయుడు హీరోగా ఆరంగ్రేటం గురించి వార్తలు ఊపందుకున్నాయి. మొన్నటి వరకూ నాగబాబు కూతురు హీరోయిన్ గా వస్తుందని వార్తల వచ్చి..ఆగిపోయిన నేపథ్యంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ ఎంట్రీ వార్తలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇక యధావిధిగా ఈ సినిమాపై మెగా  ఫ్యాన్స్ చాలా ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. తమ అభిమాన కుటుంబం నుంచి కొత్త వస్తున్న హీరో ను స్క్రీన్ పై చూడటానికి వారితో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. అయితే ఇంతకీ వరుణ్ ఆరంగ్రేటం సినిమా గురించే వివరాలు ఫైనలైజ్ అవ్వడం లేదు. మొదట ఇతడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే సినిమాతో తెరకు పరిచయం కానున్నాడని అన్నారు. అయితే ఇప్పుడు వరుణ్ ఎంట్రీ పూరి జగన్నాథ్  దర్శకత్వంలో అని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. వరుణ్ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమా పేరు 'అందగాడు' అని అంటున్నారు. వరుణ్ ను అందగాడు అని చెప్పడానికో లేక కథ డిమాండ్ మేరకు ఈ టైటిల్ పెట్టారో కానీ... ఇది వరకూ ఈ టైటిల్ తో తెలుగులో ఒక సినిమా వచ్చింది. అది కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ హీరోగా. జులపాలతో, ఎత్తుపళ్లతో, సోడాబుడ్డీ కళ్లద్దాలతో కనిపించే రాజేంద్రప్రసాద్ ను పెట్టి 'అందగాడు' అనే సినిమా తీశారు. ఈ సినిమా వచ్చి ఇప్పటికే పదేళ్లు కావోస్తోంది. ఇప్పుడు వరుణ్ తేజ సినిమాకు మళ్లీ ఆ టైటిల్ ను ఉపయోగిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English