వన్డే మిస్‌ అయితే మొత్తం మటాష్‌

వన్డే మిస్‌ అయితే మొత్తం మటాష్‌

హీరోయిన్స్‌ ఎక్కువ లేరనే ఒకే ఒక్క అడ్వాంటేజ్‌ని వాడేసుకుంటూ ఉన్న హీరోయిన్లంతా తమకి కుదిరిన దానికంటే ఎక్కువ ప్రాజెక్టులని చేసేస్తున్నారు. మొదట్లో వీళ్లు డేట్స్‌ ఇవ్వడమే మహాప్రసాదం అనుకుంటున్న నిర్మాతలు ఆ తర్వాత దాని వల్ల వచ్చే నొప్పులేంటో చూసి లబోదిబోమంటున్నారు.

తమన్నా వల్ల వరుసగా అప్పట్లో చాలా చిత్రాల షెడ్యూల్స్‌ దెబ్బతిన్నాయి. రీసెంట్‌గా సమంత కారణంగా నాలుగు చిత్రాల షూటింగ్స్‌ లేట్‌ అయి మొత్తం షెడ్యూలే మారిపోయింది. తన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరగడం వల్ల కాజల్‌ మహేష్‌ సినిమా నుంచి తప్పుకుంది. దాని వల్ల ఆ చిత్రానికి కోటి రూపాయల పైనే నష్టమొచ్చింది. ప్రతి హీరోయిన్‌తోను ఇదే తంటా వస్తోంది. ఉన్న ఆ అరడజను మందినే అటు, ఇటు తిప్పుతున్నారు కనుక హీరోయిన్లు కూడా ఏం చేయలేకపోతున్నారు.

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వారు అనుకుంటున్నారు. అయితే ఎల్లవేళలా అన్నీ అనుకూలంగా ఉండవు కనుక ఏవైనా చిన్న చిన్న అవాంతరాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద నష్టాలు జరిగిపోతున్నాయి. అందుకేనేమో మహేష్‌ సినిమాకి పాత హీరోయిన్లని వద్దనుకుని కొత్తమ్మాయిని తెచ్చి పెట్టుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు