బంగారం ఎక్కడ? కోడిపెట్ట ఎక్కడ?

బంగారం ఎక్కడ? కోడిపెట్ట ఎక్కడ?

నవదీప్‌-స్వాతి జంటగా నటిస్తున్న ‘బంగారు కోడిపెట్ట’ ఎక్కడ? ..మూడు, నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ సినిమా విశేషాలేంటో ఇంతవరకూ బైటికి రానేలేదు. ఇంతకీ ఈ సినిమా సెట్స్‌లోనే ఉందా? లేక ఏమైనా ఆటంకాలెదురయ్యాయా? ..అనేది తెలియరాలేదు. ఇటీవల నిఖిల్‌ సరసన ‘స్వామి రారా’ చిత్రంలో నటించిన స్వాతి ..ఆ సినిమా హిట్‌తో మాంచి ఖుషీలోనే ఉంది. ఈ జోరులోనే ప్లాపుల్లో ఉన్న నవదీప్‌తో సినిమా చేస్తోంది. అయితే హిట్‌ జోరులో ఉన్న స్వాతి కలయిక నవదీప్‌కి అచ్చొస్తుందేమో చూడాలి.

‘బంగారు కోడిపెట్ట’ దర్శకుడు రాజ్‌ పిప్పళ్లకి కూడా కీలకమే. తొలిసినిమా ‘బోణి’తో ఏ బోణీ కొట్టకుండా చతికిలపడిన ఈ దర్శకుడికి ఓ హిట్‌ పడాల్సిన తరుణమిది. అలాగే  మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహేష్‌ శంకర్‌కి ఈ సినిమా హెల్పవ్వాలి. అదేగాక ఆరంగేట్ర నిర్మాత సునీత తాటికి చాలా కీలకం ఈ సినిమా. ఇన్ని ఆబ్లిగేషన్స్‌ ఉన్న బంగారు కోడిపెట్ట ఏమైనట్టు? అసలు బంగారం ఎక్కడ? కోడిపెట్ట ఎక్కడ? ఎప్పుడో సమ్మర్‌లో అనుకున్న సినిమా, ఇప్పుడు జూలై ఆఖరులో అంటున్నారు. రిలీజైతే కాని అది బంగారమో కాదో తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English