ఫ్యాన్స్‌కు ఫీవర్‌ వచ్చేస్తుందేమో...

ఫ్యాన్స్‌కు ఫీవర్‌ వచ్చేస్తుందేమో...

ఫ్యాన్స్‌కు ఫీవర్‌ అంటే ఏ నిమోనియానో, కామన్‌ కోల్డో అనుకోకండి.. రాష్ట్రంలో ఉన్న సినిమా అభిమానులందరికీ ఖచ్చితంగా త్వరలోనే మూవి ఫీవర్‌ వచ్చేయడం ఖాయం. టాప్‌ హీరోల సినిమాలు ఈ ఏడాది వరుసగా సందడి చేయబోతున్నాయి. పైగా అవన్నీ దాదాపు పండుగల సమయానికి వస్తున్నాయి. అంటే జనాలు ఖాళీ కాబట్టి, కలెక్షన్స్‌ మ్యాగ్జిమం ఉంటాయి.

పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా  తెరకెక్కుతున్న ‘అత్తారింటికి దారేది’ ఆగస్టు 7న రిలీజ్‌ కానుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సెప్టెంబర్‌ 27న రిలీజవుతుంది. అలాగే ప్రిన్స్‌ మహేష్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలోని ‘1’ దీపావళి బరిలో రిలీజ్‌కి (నవంబర్‌లో) సిద్ధమవుతోంది. ఒకవేళ అప్పటికీ రిలీజ్‌ వీలు కుదరకపోతే 2014 సంక్రాంతికే వన్‌ వస్తుందిట. అలాగే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘విక్రమ సింహా’ దీపావళి సీజన్‌లోనే రిలీజవుతుందని సమాచారం. అంటే..నలుగురు స్టార్‌ హీరోల సినిమాలు పండుగ బరిలో వస్తున్నాయన్నమాట. అభిమానులందరికీ ఈ పండుగలన్నీ ఫుల్లుగా ఖుషీనిస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English