గబ్బర్‌సింగ్‌పై డౌట్స్‌ అక్కర్లేదు

గబ్బర్‌సింగ్‌పై డౌట్స్‌ అక్కర్లేదు

‘గబ్బర్‌సింగ్‌’ సీక్వెల్‌ని హరీష్‌ శంకర్‌ కాకుండా ‘రచ్చ’ దర్శకుడు సంపత్‌ నంది డైరెక్ట్‌ చేయడం అభిమానులకి అంతగా ఇష్టం లేదు. గబ్బర్‌సింగ్‌ ఫ్లేవర్‌ చెడిపోతుందేమో అని వర్రీ అవుతున్నారు. పైగా ఈ చిత్రం మొదటి సినిమాలా వినోదభరితంగా కాకుండా సీరియస్‌గా ఉంటుందనే రూమర్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ‘గబ్బర్‌సింగ్‌’ అనేది ఒక ఐకానిక్‌ క్యారెక్టర్‌ అని, దానిని మార్చడం జరగదని, ఆ క్యారెక్టర్‌తో ఎన్నెన్నో సినిమాలు తీయవచ్చని, సీక్వెల్‌లో కూడా క్యారెక్టరైజేషన్‌ అలాగే ఉంటుందని, ఈసారి కొత్త కథలో గబ్బర్‌సింగ్‌ కనిపిస్తాడని దర్శకుడు సంపత్‌ నంది చెప్పాడు.

గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ తన చేతికి రావడం ఆనందంగా ఉందని, అయితే ఇది తనపై చాలా బాధ్యత పెట్టిందని, పవన్‌కళ్యాణ్‌ ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తానని అతను అన్నాడు. త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం పనిలో పడతాడు పవన్‌. పోలీస్‌ పాత్రలో ఫిట్‌గా కనిపించేందుకు పవన్‌ ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ కూడా తీసుకుంటున్నాడు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English