రామ్‌ చరణ్‌ దానికి పడలేదు

రామ్‌ చరణ్‌ దానికి పడలేదు

తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అంటే ఇక్కడ చాలా మంది స్టార్‌ హీరోలు రెస్పెక్ట్‌ ఇస్తారు. అయితే తెలుగులో ఎవరైనా స్టార్‌ హీరోతో సినిమా తీయాలనే గౌతమ్‌ మీనన్‌ కల మాత్రం తీరడం లేదు. ఈమధ్య అతనితో పని చేయడానికి రామ్‌ చరణ్‌ ఉత్సాహం చూపించినట్టు వార్తలొచ్చాయి. చరణ్‌ని కలిసి గౌతమ్‌ మీనన్‌ కథ కూడా చెప్పాడట. కానీ చరణ్‌ ఆ కథని సున్నితంగా రిజెక్ట్‌ చేసాడట. ఇంతకీ గౌతమ్‌ చెప్పిన కథ మరేదో కాదు. ఇప్పుడతను అజిత్‌తో తీస్తున్న తమిళ సినిమానే తెలుగులో చరణ్‌తో రీమేక్‌ చేస్తానని అన్నాడట. కానీ గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో యాక్షన్‌ సినిమా చేయాలని చరణ్‌ కోరుకోవడం లేదు.

అతనికి ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరుండడంతో మంచి రొమాంటిక్‌ మూవీ చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు. చరణ్‌ ఈ చిత్రం చేయనని చెప్పడంతో దానిని తెలుగులో 'ఎంతవాడు గానీ' పేరుతో డబ్‌ చేస్తున్నారు. ఇందులో త్రిష, అనుష్క హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ప్రేమలేఖ తర్వాత హిట్‌ లేని అజిత్‌ కుమార్‌ ఇప్పుడు గౌతమ్‌ మీనన్‌ పేరు చెప్పుకుని మళ్లీ ఇక్కడ మెరవాలని చూస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు