పిండాలు డైలాగ్‌కి మండిరదంట

పిండాలు డైలాగ్‌కి మండిరదంట

ఈమధ్య ఏ సినిమా వచ్చినా కానీ అందులో ఏదో ఒక సీనో లేదా డైలాగ్‌ వల్లో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్‌ కాకముందే ట్రెయిలర్‌ చూసి కూడా మనోభావాలు హర్ట్‌ అయిపోతున్నాయి. ‘బలుపు’ చిత్రం ట్రెయిలర్‌లో ఒక డైలాగ్‌ బ్రాహ్మణులని టార్గెట్‌ చేసినట్టు ఉందని, దీనిని తొలగించాలని అప్పుడే డిమాండ్స్‌ మొదలయ్యాయి.

ఈ ట్రెయిలర్‌లో సురేఖావాణీ ‘మనోభావాలు దెబ్బతింటున్నాయి... పిండాలు పెట్టేస్తున్నారు’ అని ఓ డైలాగ్‌ చెప్తుంది. ఈ డైలాగ్‌ ‘దేనికైనా రెడీ’ టైమ్‌లో మోహన్‌బాబుకి బ్రాహ్మణ సంఘాలు పిండం పెట్టిన దానిని ఉటంకిస్తున్నట్టుగా ఉంది. దీంతో ఈ డైలాగ్‌పై సదరు సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. సినిమా రిలీజ్‌ అయ్యాక ఈ వ్యవహారం మరింత వేడెక్కడం ఖాయం. ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఆ డైలాగ్‌ని ముందే తీసేస్తారో లేక రిలీజ్‌ అయిన తర్వాత పబ్లిసిటీకి పనికొస్తుందని అలాగే ఉంచేస్తారో మరి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బజ్‌ అయితే బాగుంది. ఈ చిత్రంతో మాస్‌ మహారాజాకి మళ్లీ హిట్‌ వస్తుందని, అతని ఫ్లాప్స్‌కి బ్రేక్‌ పడుతుందని అంచనాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English