బాలకృష్ణకి నో పాలిటిక్స్‌

బాలకృష్ణకి నో పాలిటిక్స్‌

 బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రాజకీయ నేపథ్యంలో ఉంటుందని, 2014 ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా చిరంజీవిపై చాలా సెటైర్స్‌ ఉంటాయని చెబుతూ కొన్ని డైలాగ్స్‌ కూడా సర్కులేట్‌ అవుతున్నాయి. అయితే ఈ చిత్రానికీ, రాజకీయాలకీ సంబంధం లేదని, ఇది పొలిటికల్‌ సినిమా కానే కాదని, 2014 ఎలక్షన్స్‌తో దీనికి అస్సలు లింక్‌ లేదని చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర తెలియజేశారు.

 ఈ చిత్రం ఫక్తు మాస్‌ మసాలా సినిమా అని, సింహా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం కూడా అంతే పవర్‌ఫుల్‌గా, మాస్‌ని ఆకట్టుకునేలా ఉంటుందని, రాజకీయ పరమైన సంభాషణలు కానీ, ఎవరిపైనా సెటైర్లు కానీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. దీంతో అయినా ఈ చిత్రంలో డైలాగులంటూ హల్‌చల్‌ చేస్తున్నవి ఆగుతాయేమో చూడాలి. ఏదేమైనా చాలా కాలం తర్వాత నిర్మాణ దశలోనే బాలకృష్ణ చిత్రం హాట్‌ టాపిక్‌ అయి అభిమానులు, మీడియా నోళ్లల్లో నానుతోంది. ఈ క్రేజ్‌తో బాలయ్య బ్యాడ్‌ రన్‌కి బ్రేక్స్‌ పడిపోయే హిట్‌ వచ్చేస్తే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English