ఈ పాటతో పాప సెటిలైద్దా!

ఈ పాటతో పాప సెటిలైద్దా!

కొన్నాళ్ల క్రితం చాలా చాలా బిజీగా ఉన్న ప్రియమణికి ఇప్పుడు ఛాన్సులు లేవు. తనకంటే ముందు వచ్చిన హీరోయిన్లు కూడా ఇంకా బిజీగా ఉంటే తనకెందుకు అవకాశాలు రావడం లేదని పాపం ప్రియమణి తెగ ఇదైపోతోంది. ఇలాంటి టైమ్‌లో ఆమెకి షారుక్‌ ఖాన్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. షారుక్‌ తీస్తున్న సౌత్‌ మసాలా సినిమా ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’లో ప్రియమణి ఐటెమ్‌ సాంగ్‌ చేసింది.

‘1234 గెట్‌ ఆన్‌ ది డాన్స్‌ ఫ్లోర్‌’ అంటూ సాగే ఈ హుషారైన గీతం వీడియో కూడా రిలీజ్‌ చేశారు. ప్రియమణి, షారుక్‌ ఖాన్‌ రెచ్చిపోయి మరీ డాన్స్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ ఉంది. ఈ పాటతో ప్రియమణి బాలీవుడ్‌ దృష్టిని ఆకట్టుకోగలుగుతోంది. అయితే ఈ ఆకర్షణ ఆమెకి హీరోయిన్‌గా అవకాశాలు తెచ్చి పెడుతుందో లేక ఐటెమ్‌ గాళ్‌గానే సెటిలవుతుందో వేచి చూడాలి. ప్రియమణి మాత్రం ఈ చిత్రంపై లెక్కలేనన్ని ఆశలు పెట్టేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English