మంటలు రేపుతున్న పోస్టర్‌

మంటలు రేపుతున్న పోస్టర్‌

రవిబాబుకి తన సినిమాల పోస్టర్లతోనే క్యూరియాసిటీ కలిగించడం బాగా అలవాటు. 'అవును' సినిమా పోస్టర్‌లో ఏనుగు, పూర్ణని మాత్రమే వేసి ఆసక్తి కలిగించాడు. ఆ సినిమాకీ, ఏనుగుకీ ఎలాంటి రిలవెన్స్‌ లేకపోయినా కానీ భయానికి గుర్తుగా ఆ పోస్టర్‌ వేసానని చెప్పాడు. తాజాగా అతను తీస్తున్న 'అవును 2' పోస్టర్‌ రిలీజైంది. ఈసారి పూర్ణతో పాటు రెండు ఏనుగుల్ని జత చేసాడు. రెండు ఏనుగుల మధ్య ఆమె ఇరుక్కున్నట్టుగా చూపించడమే కాకుండా ఆ ఏనుగుల కొమ్ములకి మంటలు అంటుకున్నట్టు చిత్రించాడు. ఆ మంటల మాటేమో కానీ.. ఈ హారర్‌ సినిమా పోస్టర్‌లో చీర కొంగు జారిపోయి... తన జఘన భాగాన్ని చూపిస్తూ పూర్ణ మాత్రం నిజంగానే మంటలు రేపుతోంది.

ఈసారి తన పోస్టర్‌లో కేవలం హారర్‌ మాత్రమే కాకుండా శృంగారం కూడా హైలైట్‌ అయ్యేలా చూసుకున్నాడు రవిబాబు. అవును 2 చిత్రంలో రెండిటి డోసు ఎక్కువేనట. అవును కంటే పెద్ద విజయాన్ని సాధించాలంటే కాస్త సెక్స్‌ డోస్‌ పెంచాలని రవిబాబు డిసైడయ్యాడు. బాలీవుడ్‌లో సెక్స్‌, హారర్‌ మిళితం చేసి పెద్ద హిట్లు కొడుతున్నారు. ఆ ట్రెండుకి అవును 2తో శ్రీకారం చుడుతున్నాడట రవిబాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English