మంచు వారి గుట్టు రట్టు

మంచు వారి గుట్టు రట్టు

‘దేనికైనా రెడీ’ తర్వాత విష్ణు మరోసారి కామెడీ సినిమానే ఎంచుకున్నాడు. తనకి హిట్స్‌ ఇచ్చిన ఢీ, దేనికైనా రెడీ రెండూ కామెడీ సినిమాలు కావడంతో ఇదే బెస్ట్‌ అని ఫిక్స్‌ అయ్యాడు. ఓ హిందీ సినిమాని రీమేక్‌ చేస్తున్నా కానీ అది ఏ సినిమా అనే సంగతి చెప్పకుండా దాచి పెట్టాడు. ఓ సక్సెస్‌ఫుల్‌ హిందీ సినిమాకి రీమేక్‌ అని, పేరు చెప్పడం ఇష్టం లేదని మోహన్‌బాబు ఓపెనింగ్‌ రోజున చెప్పారు.

అయితే ఈ చిత్ర కథానాయిక హన్సికకి ఈ సీక్రెట్‌ సంగతి తెలీదేమో... పాపం అమాయకంగా ఆ గుట్టు రట్టు చేసేసింది. విష్ణుతో తాను చేస్తున్నది గోల్‌మాల్‌ 3 రీమేక్‌ అని హన్సిక చెప్పింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి పలువురు హీరోలు ప్రయత్నించి మానుకున్నారు. చివరకు విష్ణు చేస్తున్నాడు. అతనికి హిందీ సినిమాల రీమేక్స్‌ అంతగా కలిసి రాలేదు. సర్ఫరోష్‌, టాక్సీ నంబర్‌ 9211 చిత్రాల్ని తెలుగులో రీమేక్‌ చేసి దెబ్బ తిన్నాడు. అయితే ఇది కామెడీ ప్రధాన చిత్రం కాబట్టి దేనికైనా రెడీలా పాస్‌ అయిపోతుందేమో చూడాలి. తన సీక్రెట్‌ లీక్‌ చేసేసిన హన్సికని ఏమంటాడో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English