వర్మ..ఈ సినిమాను అమ్మాయిలు చూడగలరా?

వర్మ..ఈ సినిమాను అమ్మాయిలు చూడగలరా?

తన తాజా సినిమా 'సైకో'ను ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమా అభివర్ణిస్తున్నారు. అమ్మాయిలను వేధించే ఒకడి యదార్థగాథ ఆధారంగా ఈ సినిమాకు తాను కథా, స్క్రీన్‌ప్లే ను సమకూర్చినట్టు వర్మ చెబుతున్నాడు. ఈ సినిమాకు చాలా లేటుగా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టి న  వర్మ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. అయితే ఇప్పుడు వర్మ  ఈ సినిమాను ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పుకొస్తున్నప్పటికీ అసలు అమ్మాయిలు ఈ సినిమాను చూడగలరా? అనేదే సందేహాస్పద విషయం! హారర్ సినిమాలు, వర్మ తీసే దెయ్యాల సినిమాలు చూడాలంటే అమ్మాయిలు (అందరూ కాదు, కొందరు) భయపడతారు. అలాంటిది ఒక సైకోను చూపిస్తాము, వచ్చి చూడండి...అని వర్మ అంటే..ఎంత మంది అమ్మాయిలు ధైర్యంగా వచ్చి థియేటర్ లో కూర్చొంటారు? అనే విషయం గురించి సులభంగానే అంచనా వేయవచ్చు.

రామ్ గోపాల్  వర్మ పై ఇప్పటికే ఫ్యామిలీ టైప్ ఆడియన్స్ లో పెద్దగా ఆసక్తి లేదు. వర్మ తీసే సినిమాలు అంత అర్థవంతమైనవి, ఆసక్తికరమైనవి కాదని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో... శుక్రవారం వర్మ చెప్పినట్టుగా ఎంత మంది అమ్మాయిలు థియేటర్లవైపుకు వస్తారో చూడాలి. అమ్మాయిలు ఏమో కానీ.. ఈ కాన్సెప్టును చూస్తుంటే అబ్బాయిలు కూడా ఈ సినిమాకు వచ్చే ధైర్యం చేస్తారో చేయరో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు